ప్రజలకు సేవ చేయాలని రాజకీయంలోకి వచ్చా

ఏమ్యెల్లే.జజల సురేందర్
నాగిరెడ్డిపెట్ 24 సెప్టెంబర్  కలం జ్వాల ప్రతినిధి జై బాబా ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.శనివారం నాగిరెడ్డిపేట్ మండలం బంజార తండ సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్లొ నూతనంగా మంజూరైన 941 పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అలాగే కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ 97 చెక్కులను,మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి 15 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు తాను ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి సేవ చేస్తానని,ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తూ,ముందుకు వెళుతున్నానన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నా అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కేంద్ర బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మత రాజకీయాలకు పాల్పడుతుందని,బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను అందజేస్తోందని మరొకసారి గుర్తు చేశారు.నియోజకవర్గ ప్రజలు తనను దీవించి మరోసారి ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజ దాస్,జడ్పిటిసి మనోహర్రెడ్డి,నాగిరెడ్డిపేట్,గోపాల్పేట్,బంజారా సర్పంచులు సునీత వెంకట్రెడ్డి,వంజరి సునీత కిరణ్,అరుణ లిబియా నాయక్,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area