ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి
చౌడాపూర్,సెప్టెంబర్ 25( జనం సాక్షి ): పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ మాజీ అధ్యక్షుడు,భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్ర సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం చౌడాపూర్ మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బందయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బందయ్యా మాట్లాడుతూ..వ్యక్తి వికాసం,సమాజ హితం విశ్వ మానవ కల్యాణమే లక్ష్యంగా ఏకాత్మ మనువతవాదం ప్రతిపాదించి,సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి ప్రభుత్వ పథకాలలో మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావనను రూపొందించిన వ్యక్తి అని పండిట్ దీన్ దయాలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి శ్రీనివాసులు,మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు మాసయ్య,యువ మోర్చా అధ్యక్షుడు శరత్,రాజేష్,బాలరాజ్,శ్రీను,ని రంజన్ తదితరులు పాల్గొనడం జరిగింది.