ప్రజల అవసరాలు తెలిసిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ *
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
ప్రజల అవసరాలు తెలిసిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండలం కేంద్రంలో నీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కాటి పెళ్లి సరోజన ఆదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ కానుకగ ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను మరియు 37,04,292 రూపాయల విలువగల 37 కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు 5,31,500 రూపాయల విలువగల 19 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందచేసా రు.
ఈ మేరకు వారు మాట్లాడుతు తెలంగాణ ఆడబిడ్డలు చాలా సంబరంగా జరుకునే పండుగ బతుకమ్మ పండగ అని బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం అని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సందీప్ రెడ్డి శ్రీనివాస్ వైస్ ఎంపీపీ గౌరీ నాగేష్ సూపర్డెంట్ స్వామి తాసిల్దార్ రవీందర్ ఆయా గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు మహిళలు పాల్గొన్నారు