Wednesday, 4 November 2026

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న తుంకుంట మున్సిపాలిటీ అధికారులు

:శామీర్ పేట్, జనం సాక్షి :
దేవరయాంజాల్ ఆర్ & బి రోడ్ మీద ఏరులై పారుతున్న మురికి కాలువను పట్టించుకోని తూంకుంట మున్సిపాలిటీ అధికారులు,ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని తుంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం
రోజు తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్ మీద
సుమారు గంటన్నర సేపు ధర్నా నిర్వహించి అధికారులు వెంటనే వఛ్చి స్పందించాలని డిమాండ్ చేశారు.కలెక్టర్ మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి మురికి కాల్వకు పెద్ద పైప్ లైన్ వేయించి శాశ్వత పరిష్కారం చేయ్యాలని డిమాండ్ చేశారు.
పోలీస్ లు వచ్చి బలవంతంగా రోడ్ మీద ధర్నా చేస్తున్న నాయకులను ప్రక్కకు జరిపారు.
తర్వాత మున్సిపల్ కార్యాలయం నుండి పర్యావరణ అధికారి గణేష్ వచ్చి త్వరలో పనులు ప్రారంభించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో జరిగే బతుకమ్మ మరియు దసరా పండుగకు ఈ దారిలోనే మహిళలు చెరువుకి బతుకమ్మలు తీసుకువెళ్తారు,దసరా పండుగ రోజు
రావణ దహన కార్యక్రమానికి కూడా ఈ దారిలోనే వెళ్లడం జరుగుతుందని
ప్రజల ఇబ్బందిని అదేవిధంగా బతుకమ్మ దసరా పండుగలను దృష్టిలో ఉంచుకొని
త్వరలో మురికి కాలువ పనులు ప్రారంభించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ప్రజలతో ఉద్యమం చేస్తామని అధికారులను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి,తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ,మురళి గౌడ్,రాము,శ్రీనివాస్ యాదవ్,ధర్మారెడ్డి జగన్,మల్లేష్ గౌడ్,జాఫర్,శ్రీనివాస్,దుర్గయ్య,పాండు,రాకేష్,జాతీయ కళామండలి అధ్యక్షులు అశోక్,తదితరులు పాల్గొన్నారు.
26ఎస్పీటీ -1:మురికి పారుతున్న రోడ్ పై ధర్నా నిర్వహిస్తున్న నాయకులు