ప్రజల కన్నీళ్లు సాక్షిగా హరీష్ అంతక్రియలు
జనం సాక్షి,శంకరపట్నం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాలపూరు గ్రామంలో ఆదివారం ముంజ హరీష్ అంతక్రియలు ప్రజల కన్నీళ్ళ సాక్షిగా జరిగాయి ఈనెల 26న పెద్దపెల్లి జిల్లాలో ఉద్యోగం పేరుతో ఏడు లక్షల రూపాయల బ్రోకర్ ఇచ్చి మోసపోయి బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న విషయం పాఠకులకు విధితమే మృతదేహాన్ని కుటుంబ సభ్యులు సొంత గ్రామమైన అంబాలపూర్ గ్రామానికి తీసుకువచ్చి అంతక్రియలు నిర్వహించారు.రామగుండం ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం ఇస్తామని డబ్బులు ఇచ్చి మోసపోవడంతో మనస్తాపం చెందిన హరీష్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి డబ్బులు తీసుకున్న బాధితులపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతక్రియలు పోలీసు ల భారీ బందోబస్తు మధ్య జరిగాయి. హరీష్ మృతదేహం పై బిజెపి టిఆర్ఎస్ స్వచ్ఛంద సంఘాల నాయకులు పుష్పగుచ్చం వేసి నివాళులర్పించారు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.