ప్రజల పార్కు కోసం పోరాడుతా

స్థానిక కార్పొరేటర్ కేతావత్ సుభాష్ నాయక్
మేడిపల్లి – జనంసాక్షి
కమలానగర్ (సౌత్) పార్కు స్థలం కాపాడేందుకు తనవంతు కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ సుభాష్ నాయక్ అన్నారు. 682 గజాల పార్కు స్థలం కబ్జా అవుతుందనే విషయాన్ని స్థానిక కమిషనర్, మేయర్ కార్యాలయంలో మంగళవారం నాడు వినతిపత్రం అందజేయగా.. వెంటనే స్పందించిన కార్పొరేటర్ సుభాష్ నాయక్.. కమలానగర్ కు వెళ్లి 150 కుటుంబాల నివాసులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమల నగర్ లోని 682 గజాల పార్కు కబ్జా అయిందని స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు అధికారుల చుట్టూ తిరిగామని, అధికారులు స్పందించి అప్పటి కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్కును రక్షించి ప్రహరీ గోడతో పాటు పబ్లిక్ పార్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగిందని అన్నారు. మిగతా 682 గజాల పార్క్ ను కూడా ఈ రెండ్రోజుల్లో రెవెన్యూ సర్వేలతో కొలిపించి పార్కుకు ప్రహరీ గోడతో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేసే విధంగా తనవంతు పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తానని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, యువత స్థానిక కార్పొరేటర్ సుభాష్ నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు