అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 18
అల్వాల్ టిఎస్ ఆర్టిసి హకీంపేట్ డిపో ఆధ్వర్యంలో ప్రజల వద్దకు ఆర్టీసీ అనే వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. కౌకూర్ రిశాల బజార్ బస్ స్టేషన్ లో కార్యక్రమం ప్రారంభించారు. ఆర్టీసీ కళాబృందం ఆధ్వర్యంలో పాటలు పాడి అందర్నీ ఆకట్టుకున్నారు. డిపో మేనేజర్ భవభూతి మాట్లాడుతూ ప్రజలందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని విద్యార్థులు విద్యార్థినిలు బస్సులో ప్రయాణించాలని ఆర్టీసీ అన్ని రకాల బస్సు పాసులు రాయితీలు ఇస్తున్నదని క్షేమంగా ఇంటికి చేర్చబడును ప్రైవేటు వాహనాల కన్నా తక్కువ ధరలతో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు ప్రజలందరూ ఆర్టీసీని ఆదరించడం వల్ల ఇప్పుడిప్పుడే చాలా డిపోలు లాభాలకు వస్తున్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ కార్గో పార్సిల్ ద్వారా ఆదాయం కూడా వస్తుందని కాలి స్థలాల్లో పెట్రోల్ బంకులు షాపింగ్ కాంప్లెక్స్ లు పెట్టడం వల్ల ఆదాయం వస్తుంది అని ఆర్టిసిని ఆదరించి డిపోలను లాభాల బాటలో వచ్చే విధంగా అందరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు విద్యార్థులు అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జెఎస్ రెడ్డి, బస్సు పాస్ కౌంటర్ పవన్ కుమార్ యాదవ్, మీనాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.




