Thursday, 5 November 2026

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ విన్నపాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను శాఖల వారీగా జిల్లా అధికారులకు అందజేసి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో పెన్షన్స్ సమస్యలపై 49 దరఖాస్తులు అందజేశారని, భూ సమస్యలపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతుల నుండి 22 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ పాత్రికేయులు తమ సమస్యలపై  ప్రజావాణిలో యూనియన్ అధ్యక్షులు ఆయితబోయిన రాంబాబు, సభ్యులు జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు అందజేశారు.తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లవలసిందిగా జిల్లా కలెక్టర్ ను వారు కోరారు.   కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు,అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area