– నగరంలో 34శాతమే ప్రజారవాణ వ్యవస్థ వినియోగంలో ఉంది
– రూ. 23వేల కోట్లతో 54జంక్షన్లను అభివృద్ధి చేస్తాం
– చరిత్రలో ఎన్నడూ జరగని రోడ్ల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి
– ఆగస్టులో అవిూర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో మార్గాన్ని ప్రారంభిస్తాం
– రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్
– కొండాపూర్ వద్ద మల్టీలెవల్ ప్లైఓవర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి
హైదరాబాద్, జులై20(జనం సాక్షి) : నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని.. ఈ అంశంపై దృష్టి సారించామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొండాపూర్ వద్ద మల్టీ లెవల్ ఫ్లై ఓవర్‌కు, గచ్చిబౌలి నుంచి హాఫిజ్‌పేట్ మార్గంలో నాలుగు లైన్ల ఫ్లై ఓవర్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతుందని, జనసాంద్రత పెరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ప్రజారవాణా ఆశించిన స్థాయిలో లేదని కేటీఆర్ అన్నారు. 34శాతం మాత్రమే హైదరాబాద్‌లో ప్రజారవాణా వ్యవస్థ వినియోగంలో ఉందన్నారు. ముంబై లాంటి నగరాల్లో 70 శాతం మంది ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు. నగరంలో రూ. 23 వేల కోట్లతో 54 జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. బహుశా చరిత్రలో ఎన్నడూ జరగనంత రోడ్ల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రకరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రవాణా పెరిగే కొద్ది కాలుష్యం కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్టిక్ర్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు కేటీఆర్. అవిూర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో మార్గాన్ని ఆగస్టులో ప్రారంభిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. అవిూర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు ఉన్న మెట్రో మార్గాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ప్రారంభం చేస్తామని ప్రకటించారు. ప్రజా రవాణా వైపు ప్రజలను మళ్లించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్, జగదీశ్ గౌడ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.




