*ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

 చిట్యాల సెప్టెంబర్25( జనంసాక్షి) ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జెడ్పిటిసి గొర్రె సాగర్ అన్నారు. ఆదివారం  మండలంలోని నైన్ పాక,వరికోల్ పల్లి  చైన్ పాక, అందుకుతండా,  వెంచరామి గ్రామాలలో బతుకమ్మ చీరలను,సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీపీ దావు వినోదవీరారెడ్డి, జడ్పిటిసి గొర్రె సాగర్ పంపిణీ చేశారు.తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  పిఎసిఎస్ చైర్మెన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి,  మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి రాజ్ మహమ్మద్, సర్పంచ్లు  తోట్ల లక్ష్మి,  పేండం సాంబయ్య, రేణిగుంట స్వరూప, సిద్ధంకి భాస్కర్, కచ్చు మల్లేష్ ,ఎంపీటీసీ లు కట్టేకోళ్ల రమేష్, భూక్య సుజాత రాజు,ఉపసర్పంచ్ లు రాజేందర్,   రజిత,  నాయకులు  గ్రామ శాఖ అధ్యక్షులు కట్టేకొళ్ళ రాజు, పల్లె శశిధర్ రెడ్డి, దాసరి తిరుపతి,నందు నాయక్, ములుకోజు సమ్మయ్య, దుప్పటి శ్రీను, మోహన్,రాజేందర్ ,దామెర రాజు, కాసు కుమార్ ,పొన్నాల లింగమూర్తి ,వినోద్, సారయ్య, రామ చంద్రు, పంచాయతి సెక్రటరీలు, అంగన్ వాడి టీచర్స్, ఆశలు తదితరులు పాల్గొన్నారు.