ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయండి.
బెజ్జంకి,ఆగస్టు26,(జనం సాక్షి) మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు ధోనే అశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు ఇంచార్జ్ గడ్డం నాగరాజు పాల్గొన్నారు.అనంతరం గడ్డం నాగరాజు మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజసంగ్రామయాత్ర ఈనెల 27న ముగింపు సభను వరంగల్ లో నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హాజరు అవుతున్నారని,కావున బెజ్జంకి మండలం నుండి బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజా సంగ్రామ యాత్ర సమావేశంలో పాల్గొని సమావేశన్ని విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దొంతర వేణి శ్రీనివాస్,బోయినిపల్లి అనిల్ రావు,ఉపాధ్యక్షులు గైని రాజు,మహిళా అధ్యక్షురాలు భామండ్ల జ్యోతి,ఓబిసి మోర్చా అధ్యక్షులు బండిపెల్లి సత్యనారాయణ,యువ మోర్చా అధ్యక్షులు రమేష్,సాన బాగయ్య,వడ్లూరి శ్రీనివాస్,వడ్లూరు సాయిలు, బోనగిరి మహేష్,పట్టణ అధ్యక్షులు సంఘ రవి,ఐలేని భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.