ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్.నటరాజ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి ఆయన ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు. పించన్లు, భూసంబంధిత, ఉపాధి, ధరణి, దళిత బందు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, తదితర సమస్యలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు దరఖాస్తులను అందజేశారు. అనంతరం వారు. మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ఆసరా ఫించన్లను మంజూరు చేసిందని, అర్హులైన లబ్దిదారులకు నిబంధనల ప్రకారం ఫించన్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. భూ సంబంధిత సమస్యలను ధరణి మాడ్యూల్ లో మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శాఖల వారిగా అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి. -పరిష్కారానికి కృషి చేయాలనీ అన్నాడు. ఈ ప్రజావాణిలో ట్రైనీ సహాయ కలెక్టర్ పి.శ్రీజ, అర్డీ వో రమేష్ రాథోడ్, జడ్పీ, సీఈఓ గణపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




