ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ..

– ఎంపీపీ బక్క రాధజంగయ్య.
ఊరుకొండ, సెప్టెంబర్ 28 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆడపడుచుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగిస్తుందని ఎంపీపీ బక్కరాజంగయ్య అన్నారు. బుధవారం ఊరుకొండ మండలంలోని ఊరుకొండ పేట, నర్సంపల్లి, జకినాలపల్లి, ఇప్ప పహాడ్ గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచులు, మండల నాయకులు కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు అనిత నాగోజి, నిరంజన్ గౌడ్, అనిల్ రెడ్డి, వనజ బాలస్వామి, ఎంపీటీసీలు ఈశ్వరమ్మ ముత్యాలు, బంగారమ్మ శంకర్, ఉప సర్పంచ్లు బుచ్చమ్మ లక్ష్మయ్య, మంజులశ్రీనివాసులు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్, కోఆప్షన్ కలీం పాషా, తెరాస మండల నాయకులు సుజీవన్ రెడ్డి, టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు గిరి, టిఆర్ఎస్వి జిల్లా నాయకులు మొండేళ్ల శ్రీశైలం, మొండేళ్ల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.