ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలి
టేకులపల్లి ఎంపీడీవో దుద్దుకూరి బాలరాజు
టేకులపల్లి, సెప్టెంబర్ 20( జనం సాక్షి): ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం తప్పనిసరిగా చేసుకోవాలని టేకులపల్లి ఎంపీడీవో దుద్దుకూరి బాలరాజు అన్నారు. మంగళవారం మండలంలోని ముత్యాలపాడు క్రాస్ రోడ్డు, చింతోని చెలక, మద్రాస్ తండా గ్రామపంచాయతీలలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంట నిర్మించాలని, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కాలింగి శ్రీనివాస్, కార్యదర్శులు శ్వేత, మంగీలాల్, దీప్తి క్షేత్ర సహాయకులు తేజావత్ లకన్, సరిత పాల్గొన్నారు.