Tuesday, 3 November 2026

ప్రతి ఉద్యోగి తన సర్వీసులో ప్రజలకు అందించిన సేవలు ఎన్నటికీ మరువలేనివి విధి నిర్వహణలో హరినాథ్ రెడ్డి సేవలు ప్రజలు గుర్తుంచుకుంటారు

వికారాబాద్ రూరల్ ఆగస్టు 3 జనం సాక్షి
ప్రతి ఉద్యోగి తమ సర్వీసులు ప్రజలకు చేసిన సేవలు తిరస్థాయిగా నిలుస్తాయని హరినాథ్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షుడు బి శేఖర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ లు పేర్కొన్నారు ఇటీవల పరిగి నియోజకవర్గంలోని సుల్తాన్పూర్ బి పి ఎం హరినాథ్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని ద్విధినిర్వాణలో ఉన్నప్పుడే చేసిన సేవలు ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని వారు అన్నారు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవీ విరమణ అభినందన సభకు 20 పోస్ట్ ఆఫీస్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు మొహమ్మద్ ఆరిఫ్ ప్రధాన కార్యదర్శి పి వెంకట్ రెడ్డి యూనియన్ బాధ్యులు చంద్రశేఖర్ మహమ్మద్ ఖాదర్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు