ప్రతి ఒక్కరు చెట్లను నాటాలి

తొర్రూర్ ఆగస్టు 17 (జనం సాక్షి)
ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని శ్రీ నలంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ పిలుపునిచ్చారు హరిత భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీ నలంద పాఠశాల విద్యార్థులచే పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ చెట్లను పెంచడం వలన వాతావరణంలో సమతుల్యం నెలకొని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు.పచ్చదనం పరిశుభ్రతను పెంచడం వలన పర్యావరణం పరిరక్షించబడి అందులో నివసించే జీవకోటి ఆనందమయ జీవనాన్ని గడుపుతాయని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాకయ్య,స్వాతి, రాజశేఖర్,కిరణ్మయి, శ్రవణ్ కుమార్,ఏవో యాకన్న,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.