ఆర్థిక సహాయం అందజేత

చొప్పదండి ,ఆగస్టు 17 (జనం సాక్షి): రెండు కిడ్నీలు చెడిపోయి వైద్య చికిత్సకై డబ్బులు లేక ఇంట్లోనే ఉంటూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న చొప్పదండికి చెందిన పొన్నం శ్రీనివాస్ కు వైద్య ఖర్చులకోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండపెల్లి యాదగిరి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు .ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ గీతా కార్మికుడిగా కులవృత్తి చేస్తూ రైస్ మిల్ ఆపరేటర్ గా పనిచేస్తూ అనారోగ్యానికి గురై కిడ్నీలు చెడిపోయి వైద్య చికిత్సకు డబ్బులు లేక ఆస్పత్రికి వెళ్లలేక ఇంట్లోనే ఉండడం బాధాకరమని అన్నారు. శ్రీనివాస్ కు తన వంతు పదివేల రూపాయలు అందజేశానని అన్నారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు అయ్యే వైద్య చికిత్సకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఆయన వెంట గౌడ సంఘం అధ్యక్షులు పెరుమండ్ల గంగయ్య గౌడ్, సభ్యులు బొడిగె నందయ్య గౌడ్, పూదరి లక్ష్మయ్య గౌడ్, బొడిగె హనుమంతు గౌడ్, బుర్ర మల్లికార్జున్ గౌడ్, పొన్నం లచ్చయ్య గౌడ్, నాయకులు నలుమాచు రామకృష్ణ, ఉసుకే రాజశేఖర్ రెడ్డి, బత్తిని సంపత్ ,సాగర్ లు పాల్గొన్నారు.