ప్రతి ఒక్కరూ ఆల్బండజోల్ టాబ్లెట్స్ వేసుకోవాలి: అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ
గరిడేపల్లి, సెప్టెంబర్ 15 (జనం సాక్షి): ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ ఆల్బండజోల్ మాత్రలు వేసుకోవాలని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ కోరారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా గురువారం గానుగబండ అంగన్వాడీ సెంటర్ లో పిల్లలకు నులిపురుగుల నివారణ టాబ్లెట్స్ వేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ నులిపురుగులు వున్న పిల్లలు ఫోషకాహర లోపం రక్తహీనతతో ఎప్పుడు అలిసిపోయినట్లుగా ఉంటారని శారీరక మానసిక అభివృద్ధిలో మందకోడీగా ఉంటారని దాని నివారణ కొరకు ప్రతి ఒక్కరూ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ దైద వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం రాంబాయి, ఆశా వర్కర్స్ పంగ శివమ్మ, పోలె కాంతమ్మ, మాధవి, అంగన్వాడీ ఆయా గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.