జనం సాక్షి ఆగస్టు 30
అదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం
అన్నార్ధులకు ఆసరా ఫించన్లతో అండ
ఫించను లబ్దిదారుల హక్కు
లబ్దిదారుల ఖాతాలలోకి నేరుగా నిధులు
పైరవీలకు ఆస్కారం లేకుండా పెన్షన్లు
ఫించన్ల కోసం ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వొద్దు
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఫించన్లు మంజూరు చేశారు
ఈ విడతలో కూడా ఫించన్లు రాని వారు ఆందోళన చెందవద్దు
తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఫించను మంజూరు చేయిస్తాం
అందరికీ మేలు జరగాలన్నది కేసీఆర్ ఆకాంక్ష
కొత్త ఫించన్లతో తెలంగాణలో దాదాపు 50 లక్షల ఫించన్లు
దేశంలో రూ.2 వేలు, 3 వేలు ఫించన్లు ఇచ్చే రాష్ట్రం లేదు
రైతుబంధు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే .. 9 విడతలలో రూ.60 వేల కోట్లు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమచేశాం
దేశంలో రైతుభీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలో కేసీఅర్ కిట్ – అమ్మ వడి సాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలో కళ్యాణలక్ష్మి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
వరి నాట్లు వేసేందుకు యూపీ నుండి హమాలి పని చేసేందుకు బీహార్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్ నుండి కూలీలు వస్తున్నారు
ప్రధాని మోడీ గుజరాత్ రాష్ట్రంలో కూడా తెలంగాణ పథకాలు లేవు
అక్కడ తెలంగాణ తరహా పథకాలు అమలు చేయలేక ఈర్ష్యతో తెలంగాణ సర్కారు కాళ్లలో కట్టెలు పెడుతున్నారు
జీఎస్టీ పేరుతో రాష్ట్రాల సొమ్ములు వెనకేసుకుని తిరిగి ఇచ్చేందుకు ఇబ్బందులు పెడుతున్నారు
వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన ఆసరా ఫించను లబ్దిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు




