Tuesday, 3 November 2026

సెప్టెంబర్ 3 వ తేదీ క్యాబినెట్ సమావేశం అనంతరం..

తెలంగాణ భవన్లో సాయంత్రం 5 గంటలకు టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు.

టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొంటారు..

ఈ సందర్భంగా, రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు,తదితర అంశాలపై సమావేశం చర్చిస్తుంది..