నిజామాబాద్,జనవరి 23(జనంసాక్షి): తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తున్న తెలంగాణాకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు రక్షణ కల్పించాల్సిన బాద్యత సెక్టోరల్ అధికారులపై ఉంటుందని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా సెక్టోరల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హెచ్చరించారు. నాటిన మొక్కలను రక్షణ కల్పించి తప్పనిసరిగా ప్రతిరోజు మొక్కలకు నీరు పోయాలన్నారు. ఎక్కడైనా మొక్కలు చనిపోయినట్లు కనిపిస్తే వాటిస్థానంలో మళ్లీ నాటాలన్నారు. శాఖల వారిగా అధికారులు నాటిన మొక్కల వివరాలను ఆన్‌లైన్‌ద్వారా నమోదు చేయాలన్నారు. నాటిన మొక్కలకు వందశాతం రక్షణ కల్పించాలన్నారు.




