శుక్రవారం జిల్లా పాలనాధికారి తన ఛాంబర్ నుండి లైవ్ లొకేషన్ విధానంలో ఉపాధ్యాయుల హాజరు ను కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి జిల్లా పాలనాధికారితో పాటు అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, రాంబాబు లు పర్యవేక్షించారు. జిల్లా కలెక్టరేట్ నుండి వివిధ మండలాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు వీడియో కాల్ చేసి వారితో మాట్లాడారు. సమయానికి విధులకు హాజరవుతున్నారా, ఏ సమయానికి వస్తున్నారు, విద్యార్థుల హాజరు శాతం, తదితర అడిగి తెలుసుకున్నారు.
ప్రతీ రోజు ఇదే విధంగా పర్యవేక్షణ చేయబడుతుందని, ఉపాధ్యాయులు అందరు విధులకు హాజరవ్వాలని తెలిపారు.
అలాగే వీడియో కాల్ ద్వారా ప్రతీ పాఠశాలలో వైద్య సిబ్బంది తో మాట్లాడుతూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ద చూపాలని, ఆరోగ్యం విషయం లో తక్షణ వైద్య సేవలు అందించాలని వైరల్ ఫీవర్ రాకుండా ముందస్తు అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా. ఏ రవీందర్ రెడ్డి , జిల్లా వైద్యాధికారి ధన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు




