ప్రత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు
రుద్రంగి సెప్టెంబర్ 13 (జనం సాక్షి)
జిల్లా ఏరువాక కేంద్రం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలస శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ రుద్రంగి వారితో కలిసి మానాల క్లస్టర్ పరిధిలోని రైతుల ప్రత్తి క్షేత్రాలను సందర్శించారు.ప్రస్తుతం ప్రత్తి శాఖీయ దశ నుండి పూత దశలో ఉంది.గత రెండు రోజులుగా కురిసిన అధిక వర్షాల వలన ప్రత్తి పంటలో పార విల్ట్ (వడలు తెగులు) గమనించడం అయినది.దీని నివారణకు పై పాటుగా లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా లేదా 10 గ్రాముల 19:19:19 లేదా 13:0:45 లాంటి స్థూల పోషకాలను మరియు 5 గ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని వారం పది రోజుల వ్యవధిలో కనీసం రెండుసార్లు పిచికారీ చేయాలి.అలాగే కాపర్ ఆక్సి క్లోరైడ్ మందుని 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకుని మొక్కల మొదళ్ళు తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి.ప్రస్తుత పరిస్థితులలో గులాబీ రంగు పురుగు ఉదృత్తని గమనించ డానికి ఏకరానికి 4 లింగాకర్షక బుట్టలను ప్రతి ఒక్క రైతు సామూహికంగా అమరుచకొవాలి.ఆదేవిదంగా గుడ్డి పువ్వులను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి. ముందస్తు నివారణకు వేపనూనె (1500 పి. పి. యమ్) @ 5 మి.లీ. (లేదా) ప్రోఫెనొపాస్ @ 2 మి.లీ. (లేదా) థయోడికార్బ్ @ 1.5 గ్రాములు (లేదా) క్లోరిపైరి పాస్ @ 2.5 మి.లీ. క్వీనాల్ పాస్ @ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మందులను ఉదయం పూట గాని, సాయంత్రo పూట గాని పిచికారి చేసుకోవాలి. ఈ క్షేత్ర సందర్శనలో జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి,శాస్త్రవేత్త డా. రాజేంద్రప్రసాద్ మరియు పొలస శాస్త్రవేత్తలు డా. ఎస్. ఓంప్రకాష్,డా. ఎన్. బలరాం,డా. కృష్ణ చైతన్య,డా. మధుకర్,డా. సాద్వి మరియు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు విజయ్,జ్యోతి మరియు రైతులు తూమ్ గంగాధర్,జెరుపుల రవి,గుగులోతు రవి, భానోతు దూప మరియు ఇతర రైతులు పాల్గొన్నారు.
Attachments area