ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లాలో వివిధ రంగాలలో ప్రతిభ చాటిన బాల బాలికలకు 2022వ సంవత్సరంలో అందించనున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్ కు గాను రూ. లక్ష నగదు బహుమతితో పాటు మెడల్ , సర్టిఫికెట్, ఇతర గిఫ్ట్ లు అందిస్తారని తెలిపారు.ఈ అవార్డుల కోసం 5 నుంచి 18 ఏళ్లలోపు వారు అర్హులని , ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్ , ధైర్య సహసాలు , పాండిత్యం , క్రీడలు, కళలు, సాoస్కృతిక కళలు వంటి సేవ రంగాలో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు.ఆన్ లైన్ లో సంబంధిత వెబ్ సైట్ https://awards.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న తరువాత సంబంధిత దరఖాస్తు ప్రతిని జిల్లా సంక్షేమ అధికారి , మహిళా, శిశు, వికలాంగుల వయోవృద్దుల శాఖ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.