ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్..
సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి)ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ అధికారులకు సూచించారు.
సోమవారం ఐడీఓసీ మీటింగ్ హల్ లో జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్లు ముజమిల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.భూ సంబంధిత సమస్యలు, రెండు పడక గదుల ఇల్లు,ఆసరా పెన్షన్లు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 38 ఫిర్యాదులు, వినతులు వచ్చినట్లు తెలిపారు.ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చెన్నయ్య, కలెక్టరేట్ ఏవో రెహమాన్ వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.