ప్రధాని మన్మోహన్ సింగ్ దిష్టిబొమ్మ దహనం
కరీంనగర్ 12, జూన్ (జనంసాక్షి):
కుల సంఘాల జేఏసీి ఆధ్వరంలో తెలంగాణ చౌక్ మంగళవారం ప్రధాని మన్మోహన్ సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ పీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసినట్టు జేసీసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కులసంఘా ల జేఏసీ జిల్లా చైర్మన్ జీఎస్ ఆనంద్, నాయకులు బోల్ల లింగమూర్తి, సత్తినేని శ్రీనివాస్, లింగంపెల్లి సత్యనారయణ,ఎస్.నారాయణ, దయాల ఓంప్రసాద్ ,బడుగు లింగయ్య, కన్నమల రాకేశ్, గొడిశాల సతీశ్ గౌడ్, పల్లె నారాయణగౌడ్, బిజిగిరి నవీన్, టి. సంజీవరావు, విద్యాసాగర్, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.