Wednesday, 4 November 2026

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

.

నేరేడుచర్ల( జనం సాక్షి)న్యూస్:-
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం మండల అధ్యక్షుడు అరిబండి సురేష్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా పట్టణంలోని చౌరస్తా వద్ద మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆయన పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోడీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్కమల్ల జ్యోతిబిక్షం,జడ్పిటిసి రాపోలు నర్సయ్య,మార్కెట్ చైర్మన్ ఇంజమూరి యశోదరాములు, చిల్లెపల్లి సొసైటీ చైర్మన్ అనంత శ్రీనివాస్ గౌడ్,గ్రంధాలయ ఛైర్మెన్ మార్కండేయ,కౌన్సిలర్స్ షేక్ భాష, రమేష్ బాబు,నాగండ్ల శ్రీదర్, ఆకారపు వెంకటేశ్వర్లు,పాశం లూకాస్,చిట్యాల శ్రీను,బుడిగే చంద్రయ్య గౌడ్,సర్పంచ్, పల్లేపంగ నాగరాజు,వేమూరి నారాయణ,పోక బత్తిన రాజేష్,నందిపాటి హిందూజా,మల్లయ్య,జెట్టి వెంకన్న,వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.