Tuesday, 3 November 2026

ప్రపంచ మానవ హక్కుల సంఘం మహబూబాబాద్ జిల్లా వింగ్ ఛైర్మన్ గా బయ్యారంకు చెందిన చల్లా గోవర్ధన్

ప్రపంచ మానవ హక్కుల సంఘం మహబూబాబాద్ జిల్లా వింగ్ ఛైర్మన్ గా బయ్యారంకు చెందిన  చల్లా గోవర్ధన్*
బయ్యారం,జులై8(జనంసాక్షి):
ప్రపంచ మానవ  హక్కుల సంఘం జాతీయ ఛైర్మన్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆదేశాలమేరకు
తెలంగాణరాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ జిల్లా యూత్ వింగ్ చైర్మన్గా చల్లా గోవర్ధన్ నియమితులయ్యారు.
వరల్డ్ హ్యూమన్ రైట్స్  కుటుంబ సభ్యులు అందరూ చల్ల గోవర్ధన్ కి   శుభాకాంక్షలుతెలిపి,హృదయపూర్వకంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కుటుంబంలోనికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చల్లా గోవర్ధన్ మాట్లాడుతూ మానవ హక్కుల చట్టం ప్రకారంగా తనవంతుగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏమున్నాగాని పరిష్కరించడానికి,మానవ హక్కుల్ని ఎవరు ఉల్లంఘించినా వారిని సహించబోనని  వరల్డ్ హ్యూమన్ రైట్స్  కుటుంబం తో తనవంతుగా కృషిచేస్తానని తెలిపారు.