ప్రపంచ శాంతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

హాఫీజ్ అబ్దుల్ అలీమ్
బిచ్కుంద 10 (జనంసాక్షి) ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సోమవారం నాడు మండలకేంద్రంలో గల స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ ఫైజాన్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహ్మద్‌ ప్రవక్త బోధనలు ఆచరించి ముస్లింలు శాంతియుత జీవనం సాగించాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం హిందూ ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ స్నేహభావంతో కలిసిమెలిసి జీవించాలని కోరారు. ఇందులో అల్ ఫైజాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ అలీమ్ ఫరూఖి, మదీనా మస్జిద్ సదర్ అబ్దుల్ ముఖిత్, అబ్రార్ అలీ మరియు మసూద్ తదితరులు పాల్గొన్నారు.