సీపీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
మద్దూరు : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. సోమవారం మద్దూరు మండల కేంద్రంలో మహాసభల కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నాటి నుండి నేటి వరకూ ఎనలేని కృషి చేస్తున్న సీపీఐ పార్టీ 24వ జాతీయ మహాసభలు ఈనెల 14 నుంచి 18 వరకు విజయవాడలో జరుగబోయే మహాసభలకు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. బీజేపీ అవలంబిస్తున్న మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రేమ్ కుమార్, బాల్ రాజు, కుమార్,రమేష్ పాల్గొన్నారు.
Attachments area