సికింద్రాబాద్ (జనం సాక్షి ): ప్రభుత్వాస్పత్రుల్లో విధులు నిర్వహించేందుకు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కింద నూతన టెండర్లను పిలిచి జీవో నెం.60 ప్రకారం కార్మికుల జీతాలు రూ.15600 చెల్లించాలని టెండర్ షెడ్యూల్లో పొందుపరిచినప్పటికీ కార్మికులకు జీతాలు చెల్లించడంలో కాంట్రాక్టర్లు అన్యాయానికి గురి చేస్తున్నారని, దానిని సవరించకపోతే ఆందోళన నిర్వహిస్తామని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ తెలిపారు.
ఈ సందర్భంగా గాంధీ మెడికల్ కళాశాలలో కార్మిక నాయకులతో కార్మికుల జీతాలపై చర్చించటం జరిగింది.
ఈ సందర్బంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్, నగర అధ్యక్షులు నర్సింహ్మలు మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి జీవోను అమలు చేయకుండా కార్మికులకు అన్యాయం చేసే చర్యలు చేస్తున్నారని దాన్ని సవరించాలని వారు ఈ సందర్భంగా డి ఎం ఈ ని కోరారు .




