పాట్నా: అతనో నిరుద్యోగి. ప్రభుత్వ ఉద్యోగం కోసం గత కొన్నేళ్ల నుంచి కష్టపడుతున్నాడు. కానీ ఫలితం దక్కడం లేదు. గవర్నమెంట్ జాబ్ రాకపోవడంతో.. తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎలాగైనా తండ్రికున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని తాను దక్కించుకోవాలని.. ఏకంగా తండ్రిని హత్య చేయించాడు ఓ కుమారుడు. ఈ ఘటన బీహార్ ముంగర్ జిల్లాలోని ఈస్ట్ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
ఓం ప్రకాశ్ మండల్ అనే వ్యక్తి రైల్వేలో ఉద్యోగి. ఆయన కుమారుడు పవన్(28).. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే పవన్‌కు ఉద్యోగం రావడం లేదు. తన తండ్రి.. ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందనున్నారు. ఇక ఎలాగైనా తన తండ్రిని హత్య చేయించి.. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాలని పవన్ ప్లాన్ చేశాడు. దీంతో ఇద్దరు కిరాయి వ్యక్తులతో రూ. 2 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. ముందస్తుగా రూ. లక్ష ఇచ్చాడు. పథకం ప్రకారం తండ్రి ఓం ప్రకాశ్‌ను హత్య చేశారు. ఈ కేసులో పవన్‌తో పాటు కిరాయి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




