ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ ప్రకారం మద్యం దుకాణాలు లాటరీ ద్వారా కేటాయింపు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్, రూరల్ ఆగస్టు 3 జనం సాక్షి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో రిటైల్ మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో 2023-2025 సంవత్సరాలకు మద్యం దుకాణాలను ఎస్.టి., ఎస్.సి., గౌడ కమ్యూనిటీలకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి రిజర్వేషన్ మేరకు రిటైల్ మద్యం దుకాణాలను ఎక్సైజ్, గిరిజన, షెడ్యూల్ కులాల, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించారు. వైన్ షాపులు కేటాయించే మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరిగింది. మద్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు షాపులను కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 59 మద్యం దుకాణాలలో ఎస్టిలు 2, ఎస్సిలు 9, గౌడ వర్గాలకు 6 చొప్పున 17 దుకాణాలను ప్రభుత్వ, ఎక్సైజ్ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కేటాయించగా, 42 మద్యం షాపులు జనరల్ కేటగిరి కింద మిగిలినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, వెనుకబడిన కులాల అభివృద్ధి అధికారి ఉపేందర్ లతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు