Wednesday, 4 November 2026

ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి

-ఎస్ఎఫ్ఐ మానుకోట డివిజన్ అధ్యక్షుడు బానోత్ సందీప్

రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ కళాశాలలో పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు బాణోత్ సందీప్ డిమాండ్ చేశారు. గార్ల మండలం లో ఉన్న జూనియర్ కళాశాలకు అనుబంధంగా ఎస్సీ,ఎస్టి హాస్టల్ నియమించాలని, కళాశాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ దాదాపు కళాశాలలు తెరుచుకొని రెండు నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని, ప్రైవేట్ కళాశాల అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పెంచిన బస్సు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాల మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. ప్రాజెక్టుల మీద ఉన్న సోయి విద్యారంగంపై లేదని హితపు పలికారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు పుస్తకాలను అందజేయాలని అన్నారు. లేనియెడల ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండలం నాయకులు మాలోత్ రమేష్, సుజిత్, శిరీష, అనుష, నాగమణి, స్పందన తదితరులు పాల్గొన్నారు.