ప్రభుత్వ పథకాలు పేదలకు అందాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ముందుండాలని  జెడ్పీ  చైర్ పర్సన్ గుజ్జా దీపికా యుగేందర్ అన్నారు.సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో 2వ  స్థాయి సంఘం గ్రామీణాబివృద్ధిపై, అలాగే 4వ స్థాయి సంఘం విద్య మరియు వైద్యంపై ఆమె అధ్యక్షతన   సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె  మాట్లాడుతూ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా నిర్వహించబడిన కార్యక్రమములను విజయవంతం చేసినందుకు జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులకు  అభినందనలు తెలిపారు.జిల్లాలో సీజనల్ వ్యాదుల పట్ల అప్రమతముగా ఉండాలని అధికారులకు సూచించారు.ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జడ్పీ సిఈఓ సురేష్, జడ్పీటీసీ లు కందాల దామోదర్ రెడ్డి , రాపోలు నర్సయ్య ,మేళ్ళచెరువు కో ఆప్షన్ సభ్యులు  షేక్ ఇమ్రాన్,  సంబందిత జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.