ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరాలి

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 6:: గ్రామీణ ప్రాంతాలలో పేదరికం తగ్గించాలని ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని ఉద్దేశంతో మహిళ సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఏటీఎం పెంట గౌడ్ పేర్కొన్నారు సమైక్య సంఘాల ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు గ్రామ పేదరిక తగ్గింపు ప్రణాళిక గురించి ఆయన వివరించారు గ్రామపంచాయతీ డెవలప్మెంట్ ప్రణాళిక గ్రామ పేదరిక తగ్గింపు ప్రణాళిక పై అన్ని క్రమపంచాయతీలలో నిరుపేదలకు వివరించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు అనిత కార్యదర్శి స్వప్న కోశాధికారి పద్మ గ్రామ సమైక్య సంఘాల అధ్యక్షురాలు సిఏలు కృష్ణవేణి విజయలక్ష్మి శోభారాణి వి ఏ ఓ సి ఓ లు తదితరులు పాల్గొన్నారు