ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవితకు పునాదులు.

ఎంపీపీ గోమాస శ్రీనివాస్.
పోటో: విద్యార్థులకు యూనిఫాం అందజేస్తున్న ఎంపీపీ.
బెల్లంపల్లి, సెప్టెంబర్14,(జనంసాక్షి)
ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు అని బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన బెల్లంపల్లి మండలం మాల గురిజాల ప్రభుత్వ పాఠశాలలో ఉచిత యూనిఫాంల పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేటు కార్పొరేట్ పాటశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రయివేటులో విద్యార్థులకు ఫీజుల మోత, పుస్తకాల మోత తప్పించి వేరే ఏవిధమైన ఉపయోగం లేదన్నారు. ప్రయివేటు స్కూళ్లలో విద్యార్థులపై ర్యాంకుల ఒత్తిడి ఉంటుందని, దీని వల్ల చిన్న వయసులోనే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆశోక్, ఎంపీటీసీ శకుంతల, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆరెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.