ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన -నాయిని రాజేందర్ రెడ్డి

హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి
  గురువారం రోజున జులైవాడ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను హన్మకొండ  వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి  పంపిణీ చేశారు. పేద విద్యార్థులకై నాయిని విశాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ మరియు వసుధ ఫౌండేషన్ హైదరాబాద్ వారి తో సమిష్టిగా పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థిని, విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు పట్టుదలతో నాణ్యమైన విద్యను నేర్చుకొని భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని “నేటి బాలలే – రేపటి పౌరులు”గా భారత దేశ సంపదగా ఎదగాలని విద్యార్థినీ విద్యార్థులు మీ తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చే విధంగా క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చెప్పే విద్యను నేర్చుకోవాలని మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ఎదగాలని విద్యార్థులతో అన్నారు. కార్యక్రమం లో జులైవాడ ప్రభుత్వ ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,  ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అంకుష్,,50వ డివిజన్ అధ్యక్షులు SD .అఫ్సర్, 49 వ డివిజన్ అధ్యక్షుడు నాగపురి దయాకర్, వల్లెపు రమేష్,బందారి జనార్దన్ గౌడ్,నాగపురి కరణ్,బషీర్, నిజామ్,ఎర్రి లింగా రెడ్డి, ఎర్రి రవీందర్ రెడ్డి,భరత్,భూక్య గణేష్,రెహమతుల్లా,కోటి,రాజేష్ పాల్గొన్నారు.
Attachments area