జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు
జిల్లా సహాయ కార్యదర్శి గడిపే సుజిత్
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి) గోవర్ధనగిరి గ్రామంలోనీ ప్రభుత్వం పాఠశాలను సందర్శించి,స్థానిక సమస్యలపై స్పందించడం జరిగిందని జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు అన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సామాన్య, సాంఘిక శాస్త్రలకు సంబందించిన ఉపాధ్యాయుల కొరత ఉందని వాటిని భర్తీ చెయ్యాలని అన్నారు.విద్యార్థుల కోసం పౌష్టికాహారం అందించి,నాసిరకం బియ్యనికి బదులుగా సన్న బియ్యంతో భోజనం అందిచాలని సూచించారు. ప్రతి విద్యార్థికి యూనిఫామ్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మనోహర్ డుర్ముట్ల శివ,మధటబోయిన, అజెయ్ తదితరులు పాల్గొన్నారు.




