ప్రభుత్వ పాఠశాల స్లాబ్ పైన మద్యం సీసాలు.

నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్. మందుబాబులు ఆగడాల రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. స్థానిక పోలీసులు నిత్యం కేసులు నమోదు చేస్తున్న అవి వారికి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు, కొందరు సరస్వతి నిలయంగా కొలిచే పాఠశాలను సైతం మందుబాబులు అడ్డగా మార్చుకోవడం విడ్డూరంగా కనిపిస్తుంది.పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం స్లాబ్ పైన మందు బాబులు మద్యం సేవిస్తూ మద్యం సీసాలు అక్కడే వదిలేశారు.బహిరంగ మద్యపానం నిషేధం పోలీసు కేసులు నమోదు చేస్తున్న అవేవీ పట్టనట్లు మందు బాబులు పాఠశాలలో మద్యం సేవిస్తూ ఉండడం గమనార్హం..స్థానిక పాఠశాలలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుభ్రం చేయాల్సి ఉన్న కనీసం చూడకపోవడంతో ఖాళీ సీసాలు గ్లాసులతో ఉన్నత పాఠశాల ప్రాంగణం స్లాబ్  పైన ఖాళీ సీసాలు కళా విహంగ కనిపిస్తోంది. మండలంలోని అన్ని పాఠశాలలను పర్యవేక్షించాల్సిన మండల విద్యాశాఖ అధికారి పాఠశాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇలాంటి పరిస్థితులు దారితీస్తున్నాయి…
 ఇకనైనా అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగును చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు…

తాజావార్తలు