అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలి
ప్రజల్లో కంటి పరీక్షలపై చైతన్యం తీసుకుని రావాలి
ఆపరేషన్లు అవసరమైతే సవిూప ఆస్పత్రులకు రెఫర్ చేయాలి
కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ
హైదరాబాద్,ఆగస్ట్9(జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తెలంగాణకు కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 15న ప్రతిష్టాత్మకంగ ఆప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లాల్లో సన్నాహక సదస్సులు, అవగాహన కార్యక్రమాలు చేట్టారు. అయితే గ్రామల్లో వసతుల కొరత వేధిస్తోంది. సరైన టెస్టింగ్ పరికారాలు ఇప్పటికీ అందుబాటులో లేవన్న విమర్శలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికీ కనీస వసతులు లేవు. అయితే ఈ టాస్క్‌ను పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతోంది. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంపై జిల్లాలకు చెందిన వైద్యాధికారులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసి అధికారులు ఈ కార్యక్రమాన్ని ముందు నిలపాలని అన్నారు. పట్టుదలతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. /ూష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటి వెలుగులు ప్రసరించి అంధత్వ నిర్మూలన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో జయప్రదం చేయాలని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధ పడేవారు చాలా మంది ఉంటారన్నారు. ఆదివాసీలు ఎక్కువగా ఉన్నచోట మనసుపెట్టి సేవా దృక్పథంతో పని చేయాలన్నారు. వైద్య శిబిరంలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతాయని అన్నారు. మొత్తం 40శాతం జనాభాకు కంటి సమస్యలున్నాయని అంచనా వేశామన, అందుకు అనుగుణం
గా మందులు, కంటి అద్దాలు, పరికరాలు సిద్ధం చేశామన్నారు. గ్రామాల్లో రోజుకు 250 మంది చొప్పున పరీక్షలు చేయాలన్నారు. ఏ ఒక్కరూ తప్పి పోకుండా చూడాలన్నారు. కంటి చూపుకు సంబంధించి మైనర్ సమస్యలకు అప్పటికప్పుడు మందులు, విటమిన్ టాబ్లెట్లు, కంటిఅద్దాలు ఇవ్వాలన్నారు. కాటరాక్ట్,గ్లూకోమా వంటి తీవ్రమైన సమస్యలుంటే శస్త్ర చికిత్సల కోసం సవిూప ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేయాలన్నారు. గ్రామాల్లో కంటిపరీక్షలు చేయించుకోవడానికి నిరాసక్తత వ్యక్తం చేస్తారని.. వారికి కంటిచూపు ప్రాముఖ్యతను వివరించి నచ్చచెప్పి కంటి పరీక్షలు చేయించుకునేలా చేయాలన్నారు. చదువుకునే పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి వారు పరీక్షలు చేయించుకునేలా చేయాలన్నారు. ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు పోవాలన్నారు. కార్యక్రమ పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. గ్రావిూణ ప్రాంతాల్లో కూలీలు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారని.. వారి కూలీ పనులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉదయమే కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలని అన్నారు.
రెండు రోజుల ముందు నుంచే డప్పు చాటింపులు చేసి గ్రామస్తులందరికీ సమాచారం ఇవ్వాలన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి కంటి పరీక్షల ప్రాముఖ్యత, షెడ్యూల్‌పై వివరించాలన్నారు. వైద్యబృందంలో ఎవరు విధులకు హాజరు కాకపోయినా ఇబ్బంది అవుతుందని.. అలాంటి పరిస్థితుల్లో మెడికల్ ఆఫీసర్ ప్రత్యామ్నయం చూసి క్యాంపు కొనసాగేలా చూడాలన్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ప్రత్యేకంగా తేదీ చెప్పి రావాలన్నారు. వైద్య సిబ్బందికి అవసరమైన బస, వసతి ఏర్పాట్లను ముందుగానే చూసుకోవాలన్నారు. ఇందుకోసం రూట్‌మ్యాప్ రెడీ చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, అధికారులతో వార్డుల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. అందరి భాగస్వామ్యంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.




