ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

సూర్యాపేట ( జనంసాక్షి ):ప్రయాణికులకు కనీస మౌలిక సదుపాయాలు లేవని విద్యార్థి సంఘాల నాయకులు శనివారం జిల్లా కేంద్రంలోని  కొత్త బస్టాండ్ లో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్టాండ్ లో ఉన్న మంచి నీటి ట్యాంక్ లు నిరూపయోగంగా ఉన్నాయని,మంచి నీటి సౌకర్యం లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.మంచి నీటిని కూడా కొనుక్కునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.సమయానికి అనుకూలంగా అన్ని రూట్లలో బస్సులు నడపాలని,ప్రయాణికులకు మౌలిక సదుపాయలు కల్పించాలని డిపో అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య, టీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బారీ అశోక్, టీవీవీ జిల్లా అధ్యక్షులు గుండాల సందీప్, జనసేవసమితి రాష్ట్ర అధ్యక్షులు తగుళ్ల జనార్దన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.