సోషల్ విూడియా ప్రచారాలతో ప్రజల బెంబేలు
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి..పలువురికి గాయాలు
తెలుగు రాష్ట్రాల్లో భయానక పరిస్థితులు
హైదరాబాద్,మే23( జనం సాక్షి): తెలుగు రాష్ట్రాల్లో సోషల్ విూడియా పుకార్లు ప్రజల ప్రాణాల విూదకు వస్తోంది. అనుమానితుల కనిపిస్తే చాలు దాడి చేసి చావగొడుతున్నారు. నిజామాబాద్, యదాద్రి ఘటనలు చూస్తుంటే కొత్తవారు వేరే గ్రామానికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ప్లలెల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు స్థానికులు దాడులు చేస్తున్నారు. విచక్షణారహితంగా కొట్టి చంపేస్తున్నారు. తెలంగాణలో 24 గంటల్లో ఇద్దరిని కొట్టి చంపారు. ఇన్నాళ్లు హిందీ మాట్లాడేవారినే టార్గెట్ చేస్తూ వచ్చిన గ్రామాల్లోని ప్రజలు.. ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నా వారిపై దాడులకు తెగబడుతున్నారు. తమది పక్క గ్రామమే అని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. రాత్రి సమయంలో వేరే గ్రామానికి వెళ్లాలన్నా ప్రజలు భయపడుతున్నారు. కొత్తవారు ఏ మాత్రం కనపడినా అంతేసంగతులు. చాల గ్రామాల్లో రాత్రి పూట యువకులు గస్తీ కాస్తున్నారు. ఏ మాత్రం అనుమానం కలిగినా వారిని వదిలిపెట్టడం లేదు. చెట్లకు, విద్యుత్ స్తంభాలకు కట్టేసి మరీ కొడుతున్నారు. ఆ తర్వాత ఎప్పుడో పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. ఇలా తాజాగా తెలంగాణలో ఇద్దరిని కొట్టి చంపారు. యాదాద్రి జిల్లా బిబీనగర్ మండలం జియాపల్లిలో దారుణం జరిగింది. దొంగ అనే అనుమానంతో ఒకరిని కొట్టి చంపారు. జియాపల్లి గ్రామస్థులు, ఘట్కేసర్ మండలం కొర్రెముళ్ళ గ్రామానికి చెందిన నిమ్మల బాలకృష్ణ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ అయిన తన బందువులైన జియాపల్లి గ్రామానికి చెందిన కొత్త రామస్వామి ఇంటికి సాయంత్రం వెళ్లగా కొంతమంది ఆకతాయిలు రాత్రి 8గంటల సమయంలో అతనిపై దాడి చేశారు. అది గమనించిన బంధువు అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడు. సోషల్ విూడియాలో వైరల్ అవుతున్న పుకార్లు నిజామాబాద్ జిల్లాలోని ప్లలెల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. జనాల్లో నెలకొన్న అనుమానాలు, భయాలు అమాయకుల ప్రాణాల విూదకు తెస్తున్నాయి. భీమ్ గల్ మండలం చెంగల్లో ఇలాంటి అనుమానాలతోనే ఇద్దరు గిరిజనులను జనాలు తీవ్రంగా చితకబదారు. దాడిలో గాయపడ్డ ఒకరు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. చెంగల్ సవిూపానికి ఉన్న తాండాలకు చెందిన దేవాగత్ లాలూ, అతని బావమరిది మాలావత్ దేవ్యా అనే గిరిజనులు మామిడి కాయల కోసం ఓ తోటలోకి వచ్చారు. సరిగ్గా అదే సమయానికి నీళ్లకోసం అటుగా వెళ్లిన పశువుల కాపరి వాళ్లను చూసి భయపడి తన తండ్రికి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న గ్రామస్తులు ఇద్దరినీ కర్రలతో తీవ్రంగా చితకబాదారు.
అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ భవనం వద్ద బంధించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు దేగావత్ లాలూను ఆర్మూరు మహాత్మాగాంధీ ఆస్పత్రికి, మాల్యావత్ దేవ్యాను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. గ్రామస్తుల చేతిలో తీవ్రంగా గాయపడిన దేవ్యా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడిది దర్పల్లి మండలం ధనబండ తాండాగా పోలీసులు గుర్తించారు. ఇక ఎపిలోని నందిగామ, మచిలీపట్నంలో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడం, హిందీలో మాట్లాడితే పట్టుకుని చితక్కొడుతున్నారు. రాత్రిపూట కంటివిూద కునుకులేకుండా స్థానికులు కాలం గడుపుతున్నారు. మచిలీపట్నం, ఈడపల్లిలో పిల్లలను ఎత్తుకుపోయేవాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని పట్టుకుని కొట్టారు. బాధితుడిని చిలకలపూడి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పుకార్లను నిలువరించే ప్రయత్నం చేసినా కూడా దాడులు మాత్రం ఆగడంలేదు.




