వయోపరిమితిని చర్చీలు, మసీదుల్లో పెట్టండి

కర్నూలు,మే23( జ‌నం సాక్షి):హిందూ దేవాలయాల విషయంలో అర్చకులకు వయోపరిమితి విధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దమ్ముంటే అదే పని చర్చీలు, మసీదులకు చేయగలరా అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డి సవాల్‌ చేశారు.హిందూ దేవాలయాలను చులకనగా చూస్తున్నారని,అందుకే అర్చకులకు వయో పరిమితి పెట్టారని ఆయన అన్నారు. చంద్రబాబుకి దమ్ముంటే మసీదులు, చర్చిలలో ఉన్నవారికి వయోపరిమితిని వర్తింపజేస్తూ ఆర్డినెన్స్‌ జారీచేయాలని సవాల్‌ విసిరారు. టీటీడీ అధికారుల తప్పుడు వైఖరితో శ్రీవారి సంపద కొల్లగొట్టబడుతోందని ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణచేయించాలని డిమాండ్‌ చేశారు.ప్రభుత్వానికి మడుగులు వత్తుతున్నారు కాబట్టే జేఈఓగా శ్రీనివాస రాజు తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్నారని ఆరోపించారు