ప్రాణాలైనా అర్పిస్తాం సర్వేను త్రిబుల్ ఆర్ పనులు సాగనివ్వం
.
జన సమితి జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి:
జనం సాక్షి సంగారెడ్డి రూరల్
సంగారెడ్డి మండల్ చింతలపల్లిలో ఆర్ ఆర్ ఆర్ రోడు సర్వే పనులను అడ్డుకున్న రైతులు: ప్రాణాలైనా అర్పిస్తాం సర్వేను త్రిబుల్ ఆర్ పనులు సాగనివ్వం: తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి: ఆర్ ఆర్ ఆర్ రోడ్ నిర్మాణం తో చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోయి నష్టం వాటిలే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయని త్రిబుల్ ఆర్ సర్వే పనులను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి అన్నారు మంగళవారం సంగారెడ్డి మండల పరిధిలోని చింతలపల్లిలో త్రిపుర రోడ్డు పనుల కోసం అధికారులు సర్వే చేస్తుండగా రైతులు పెద్ద ఎత్తున సర్వేపల్లి డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తుల్జారెడ్డి మాట్లాడుతూ సర్వే సిబ్బంది తక్షణమే రోడ్డు సర్వే పనులు నిలిపివేసి వెళ్లిపోవాలని నినాదాలు చేసి వారిని పంపించేశారు. ప్రభుత్వం చిన్న రైతులను మోసం చేసేందుకే త్రిపుర పనులు చేస్తోందని పెద్ద రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం పెత్తందారులకు అండగా నిలుస్తుందని ఆరోపించారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ త్రిపుర రోడ్డు పనులను అడ్డుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో రైతులు అనంతయ్య ,నాగరాజు, వెంకటయ్య ,లక్ష్మీనారాయణ, తిరుపతయ్య ,గోవర్ధన్, రాములు తదితరులు ఉన్నారు.