హుజూర్ నగర్ ఆగస్టు 26 (జనం సాక్షి): మండలంలోని కరక్కాయల గూడెం నందు ఉన్నటువంటి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా జిల్లా విద్యాధికారి అశోక్ శుక్రవారం తనిఖీ చేశారు. దీనిలో భాగంగా తరగతి గదికి వెళ్లి విద్యార్థుల యొక్క ప్రగతిని, హాజరును పరీక్షించనైనది. అంతేకాకుండా ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదిలో బోధించే అంశాలను పరిశీలించడం జరిగిందన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం, ప్రతిరోజు అందించేటటువంటి మెనూను గురించి వంట వాళ్లను అడగడం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు బి. వెంకటేశ్వర్లు, వి. రామకృష్ణ, ఎం నాగ మోహన్ రావు, వి. నరేష్, జి. శ్రీధర్ గౌడ్, పి. విజయలక్ష్మి, సీఆర్ పి బ్రహ్మం పాల్గొన్నారు.
ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి




