ప్రీతమ్ జోనాకు ఘన నివాళులు

నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి

జోనా జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి
ప్రవల్లిక ప్రకాష్ కుమారుడు గండూరి ప్రీతమ్ జోనా రెండవ వర్ధంతి సందర్భంగా ప్రీతమ్ జోనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.స్థానిక ఖమ్మం రోడ్డులోని అమ్మ గార్డెన్స్ లో ఉన్న జోనా సమాధి వద్ద రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నివాళులు అర్పించారు.అంతకముందు పట్టణంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు.అనంతరం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్ మాట్లాడుతూ జోనా జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.గండూరి జానకమ్మ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్ళ పంపిణీ , సూర్యాపేట కాటికాపార్లకు, దివ్యాంగులు, తాపి కార్మికులకు , మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు , దిగుమతి హమాలీలకు , కార్మికులకు , పెయింటర్లకు ఉచితంగా పెట్రోలును పంపిణీ చేశారు.స్థానిక 43, 25, 36వ వార్డులలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు.అపూర్వ బధిరుల పాఠశాల , గోపాలపురం , ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ , సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ , మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితా ఆనంద్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ , వివిధ వార్డుల కౌన్సిలర్లు , నాయకులు , కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.