ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్
సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
అడిషనల్ కలెక్టర్ వై.వి గణేష్ కు రాఖీ కట్టిన తస్లీమా
ములుగు,ఆగస్ట్12(జనం సాక్షి):-
బంధాలను వదులుకోలేని,అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధన్ అని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు.శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ వై.వి గణేష్ కు సంప్రదాయ పద్ధతిలో బొట్టు పెట్టి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా అడ్మనిస్ట్రేటివ్ ఆఫిసర్ విజయ భాస్కర్,సూపరెండెంట్ రాజ్ ప్రకాష్, తాహసిల్దర్ సత్యనారాయణ,ములుగు మండలం బండారుపల్లి బాలుర గురుకులం పాఠశాలలోని విద్యార్థులకు సంప్రదాయ పద్ధతిలో బొట్టు పేట్టి రాఖీ కట్టిన తస్లీమా పిల్లలను ఆశీర్వదించారు.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన రిజిస్ట్రేషన్ దారులకు కూడా రాఖీ కట్టారు.యువకులకు,ప్రజా ప్రతినిధులకు,రాజకీయ నాయకులకు,గ్రామ పంచాయితీ సిబ్బందికి మార్కెట్ లో వ్యాపారులకు తస్లీమా రాఖీ కట్టారు.భారత దేశం సంస్కృతి, సాంప్రదాయాలు చాలా విశిష్టమైనవని,రాఖీ పండుగకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని,రక్షాబంధన్ ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుందని తస్లీమా అన్నారు.