ప్రేమ వైఫల్యంతో యువతి ఆత్మహత్యా యత్నం

అడ్డుకున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌
వరంగల్‌,మే12(జ‌నం సాక్షి ): ప్రేమించిన యువకుడు మోసం చేశాడని నడిరోడ్డుపై ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడి మోసాన్ని తట్టుకోలేని యువతి వరంగల్‌ హెడ్‌పోస్ట్‌ ఆఫీస్‌ చౌరస్తాలో బ్లేడ్‌తో చేతి మణికట్టు కోసుకుంది. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వెంటనే గమనించి యువతిని అడ్డుకున్నాడు. అప్పటికే ఆమె చేతికి గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో వెంటనే ఆమెను సవిూపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.