గణపురం ( ము ) జనం సాక్షి జూన్ 19: మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ప్రైవేట్ పనులకు వాడుతున్నాడు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ప్రభుత్వం లక్షల రూపాయలను వే చించి గ్రామ పంచాయతీలకు పనిచేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లను ప్రైవేటుపనులకు వాడకూడదు ప్రభుత్వం జి పి ఆర్ ఎస్ సిస్టం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయినా గ్రామపంచాయతీ సర్పంచ్ కార్యదర్శుల ఇష్టానుసారంగా ప్రైవేట్ పనులకు ట్రాక్టర్ ట్యాంకర్లను, పంపించడం జరుగుతుంది. ప్రైవేటు పనులకుపంపితే వచ్చే ఆదాయం సొంత ఖర్చలు నిమిత్తం వాడుకోవడం జరుగుతుంది, కాబట్టి గ్రామపంచాయతీ ఆదాయానికి గండి కొట్టి ప్రైవేట్ పనులకు వాడుకోవడం మూలంగా రిపేర్ ల మూలంగా గ్రామ పంచాయతీకి అనేక రకాలుగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎలాంటి ప్రైవేట్ పనులకు పంపకుండా గ్రామ పంచాయతీ పనుల కు వాడుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




